వైసీపీని గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన మాజీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు ఏపీ నుండి రాజ్యసభ అభ్యర్థిగా కృష్ణయ్యను బీజేపీ ప్రకటించింది.గతంలో ఆయన వైసీపీ తరపున రాజ్యసభకు వెళ్లారు.అయితే ఈఏడాది జరిగిన ఎన్నికల తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి ఆయన రాజీనామా చేశారు.మరోవైపు హర్యానా నుండి రేఖాశర్మను, ఒడిశా నుండి సుజిత్ కుమార్ ను రాజ్యసభ అభ్యర్థులుగా బీజేపీ నాయకత్వం ఎంపిక చేసింది.వైసీపీకి,రాజ్యసభ సభ్యత్వాలకు ఆర్.కృష్ణయ్యతో పాటు మోపిదేవి వెంకటరమణ,బీద మస్తాన్ రావులు కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.అయితే మోపిదేవి, బీద మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీలో చేరారు.
Previous Articleసిరియాలో మళ్లీ స్థిరత్వం రావాలని ఆకాంక్షించిన భారత్
Next Article ఈ నెల 11న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 7వ ఎడిషన్