దేశవ్యాప్తంగా 51 కేంద్రాలలో ఈ నెల 11 వతేదిన ఒకేసారి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 7వ ఎడిషన్ ప్రారంభంకానుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సంవత్సరానికి గాను 54 మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పీ.ఎస్.యూలు, పరిశ్రమల ద్వారా 250 కంటే ఎక్కువ సమస్య సవాళ్లను సమర్పించారు.
విద్యార్థుల్లో సవాళ్ళను ఎదుర్కొనే ఆలోచనా దృక్పధాన్ని పెంపొందించడం, కొత్త ఆవిష్కరణలకు అంకురార్పణ చేసే విధంగా ప్రోత్సాహించి వారిలో సృజనాత్మకతను వెలికి తీయడం, వాస్తవ దృక్పధాన్ని విశ్లేషించి సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంతో హ్యాకథాన్ లను నిర్వహిస్తుంటారు.
Previous Articleఏపీ నుండి రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ .కృష్ణయ్యను ప్రకటించిన బీజేపీ…!
Next Article నష్టాలతో వారం ప్రారంభించిన సూచీలు