నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు మొదటి టెస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ విజయవంతంగా జరిగింది. ఈ విమానాశ్రయం దేశ, రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుందని కొత్త అవకాశాలను సృష్టిస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. కనెక్టివిటీని మెరుగు పరుస్తుందని ప్రపంచ విమానయాన కేంద్రంగా భారత స్థానాన్ని బలోపేతం చేస్తుందని ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధిలో ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మార్గదర్శకత్వంలో ఈ విమానాశ్రయం.. ప్రాంతీయ కనెక్టివిటీలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తుందని వివరించారు. అలాగే భారత విమానయాన రంగం విస్తరణలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు.
ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌ను నిర్మించడంలో, అంకితభావంతో నిర్మాణంలో పాల్గొన్న సిబ్బందితో కూడా ఈ సందర్భంగా మాట్లాడినట్లు తెలిపారు. వారి కృషిని ప్రశంసించారు. అదే విధంగా ఈ అద్భుత సంకల్పానికి జీవం పోయడంలో కీలకంగా వ్యవహరించిన జేవార్ ఎమ్మెల్యే – ధీరేంద్రసింగ్, గౌతమ్ బుద్ధనగర్ ఎంపీ డాక్టర్ మహేశ్ శర్మ , స్థానిక నాయకులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మొదటి టెస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ విజయవంతం
By admin1 Min Read