అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప 2 ది రూల్.ఈ సినిమా పట్నా ఈవెంట్ ను ఉద్దేశించి నటుడు సిద్ధార్థ్ వైరల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.ఆయన కామెంట్స్ వైరల్ గా మారిన తరుణంలో దానిపై క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు అని తెలిపారు.తనకు ఏ హీరో మీద కోపం లేదని అన్నారు.
ఇండస్ట్రీ ఎప్పుడూ కళ కళలాడుతూ ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.నిర్మాతలకు మంచి జరగాలని.. నటీనటులకు తగిన గుర్తింపు రావాలని ఆయన తెలిపారు.పుష్ప ఈవెంట్ కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడాన్ని ఉద్దేశించి ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ జరిగినప్పుడు నాలుగు జెసీబి లు వస్తె వాటిని చూడడానికి కూడా చాలామంది జనం వస్తారు అన్నారు.ఇది సోషల్ మీడియా లో వివాదానికి దారి తీసింది.