న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ప్రజలను ఆకర్షించేందుకు అధికార ఆప్ పార్టీ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది.హామీల వర్షం కురిపిస్తుంది.తాజాగా మహిళల కోసం ప్రత్యేక హామి ఇచ్చారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. తాము మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెలా రూ.2,100 ఆర్థికసాయం చేస్తామని ప్రకటించారు.
‘నేను ప్రతి మహిళకు రూ. వెయ్యి ఇస్తానని హామీ ఇచ్చాను.ఈ ప్రతిపాదనకు గురువారం ఉదయం మంత్రివర్గం ఆమోదం తెలిపింది.మరో 10-15 రోజుల్లో ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ డబ్బు అభ్యర్థుల ఖాతాల్లో బదిలీ చేయడం సాధ్యం కాదు.మరోవైపు ద్రవ్యోల్బణం కారణంగా ఆ మొత్తం చాలదని పలువురు మహిళలు నా దృష్టికి తీసుకొచ్చారు.అందుకే నెలకు రూ.2,100 ఇవ్వాలని నిర్ణయించాం’ అని తెలిపారు.