ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమలలో ఇటీవల ఒక ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.సాధారణ భక్తులను కొంత సమయం ఆపి మలయాళ నటుడు దిలీప్ కు వీఐపీ దర్శనo కల్పించారు.భక్తులను ఇబ్బంది పెట్టిన ఈ ఘటనపై కేరళ హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.“ ఇది చాలా తీవ్రమైన విషయం” అని వ్యాఖ్యానించింది. ” నటులు అయితే అటువంటి వ్యక్తులకు ఉన్న ప్రత్యేక అధికారాలు ఏమిటీ?” అని దేవస్థానం బోర్డును, చీఫ్ పోలీస్ కోఆర్డినేటరును నిలదీసింది.ఇది కొన్ని నిమిషాల విషయం కాదని, నటుడి వీఐపీ దర్శనం కోసం ‘సోపానం’ ముందున్న మొదటి రెండు వరుసల భక్తులను చాలాసేపు ఉక్కిరిబిక్కిరి చేశారని జస్టిస్ అనిల్ కె.నరేంద్ర, జస్టిస్ మురళీకృష్ణల ధర్మాసనం
తెలిపింది.డిసెంబరు 5న జరిగిన ఈ ఘటనకు
సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ తెప్పించుకొని చూసిన కోర్టు ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది.
Previous Articleక్లింకార ఫోటో షేర్ చేసిన ఉపాసన…!
Next Article ఉభయ సభల్లో రాజ్యాంగంపై చర్చ