తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో అరెస్టయిన
కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు శుక్రవారం ఆయనకు బెయిలు మంజూరు చేసింది. ఆయనతోపాటు ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ, మరో ఏడుగురు నిందితులు కూడా బెయిలును పొందారు. రేణుక స్వామి హత్య కేసులో వీరికి ఈ ఉపశమనం లభించింనట్లు అయింది. రేణుకా స్వామి అసభ్య సందేశాలు పంపించడంతో పవిత్ర గౌడ ఆగ్రహానికి గురి అయ్యారు. అదే విషయాన్ని దర్శన్ కి చెప్పారు. ఆయన తన బృందంతో కలిసి రేణుకా స్వామి పై దాడి చేశారు. హత్య చేశారు. ఇది బెంగళూరులో కలకలం సృష్టించింది.
Previous Articleజడ్జీలు ఫేస్ బుక్ వాడవద్దు: సుప్రీం కీలక వ్యాఖ్యలు
Next Article న్యూయార్క్ లో అనుమానాస్పద డ్రోన్ల కలకలం