న్యాయమూర్తులు ఋషి, సన్యాసి మాదిరిగా జీవించాలని సుప్రీం కోర్టు తెలిపింది. గుర్రాల మాదిరిగా వేగంగా పని చేయాలని చెప్పింది. న్యాయ సంబంధిత అంశాల్లో వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా సంయమనం పాటించాలని తెలిపింది సామాజిక మాధ్యమాలను వాడవద్దని స్పష్టం చేసింది. తీర్పులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని కోరింది. న్యాయ వ్యవస్థలో తళుకుబెళుకు ఆకర్షణలకు చోటు లేదని వివరించింది. మధ్యప్రదేశ్ కు సంబంధించిన ఇద్దరు న్యాయమూర్తుల కేసులో సుప్రీం ఈ వ్యాఖ్యలు చేశారు.
Previous Articleడే లైట్ ఆదా సమయాన్ని రద్దు చేస్తాః ట్రంప్
Next Article దర్శన్ కు బెయిల్ మంజూరు