ఆర్ఎస్ఎస్ మాజీ నాయకుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నారని రాజ్యాంగ పరిషత్ చర్చలు చెబుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.బీజేపీ మాయమాటలతో దేశ ప్రజలను మోసం చేస్తోందని,బదులుగా కాంగ్రెస్‌పై నిందలు వేస్తోందని విమర్శించారు.జాతీయ జెండాను,అశోక్ చక్రాన్ని,రాజ్యాంగాన్ని ద్వేషించిన వారే నేడు రాజ్యాంగంపై పాఠాలు బోధిస్తున్నారని ఆరోపించారు.రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని,అందుకే కుల గణనను వ్యతిరేకిస్తోందని అన్నారు.భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాజ్యసభలో ఈరోజు ప్రత్యేక చర్చ జరిగింది.ఈ మేరకు బీజేపీ,ఆర్ఎస్ఎస్పై ఖర్గే విమర్శలు గుప్పించారు.
రాజ్యాంగం గురించి మీరు మాకు పాఠాలు చెబుతున్నారా:- మల్లికార్జున ఖర్గే
By admin1 Min Read
Previous Articleచంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
Next Article యాచకులకు డబ్బు ఇస్తే కేసులే…!