యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు మధ్యప్రదేశ్లోని ఇందౌర్ నగరం కీలక చర్యలు చేపడుతుంది.ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లా అధికారులు భిక్షాటనను నిషేధించారు.యాచకులకు సాయం చేసే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని తాజాగా హెచ్చరించారు.భిక్షాటన చేసేవారికి డబ్బులిచ్చేవారి పైనా ఎఫ్ఎస్ఐఆర్ లు నమోద చేస్తామని ప్రకటించారు.జనవరి 1, 2025 నుంచి ఈ నిబంధనలు అమలోకి వస్తాయని చెప్పారు.
యాచకులులేని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు చేపడుతున్నాం.డిసెంబర్ చివరి వరకు
వీటిపై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తాం.జనవరి 1 నుంచి యాచకులకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నటు కనిపిస్తే వారిపై ఎఫ్ఎస్ఐఆర్లు నమోదు చేస్తాం” ఇందౌర్ కలెక్టర్ ఆశిశ్ సింగ్ తెలిపారు.