ఈ సంవత్సరం నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెటర్ గా హార్థిక్ పాండ్య నిలిచాడు. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో హార్థిక్ పాండ్య కీలక ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ లో ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక ఐపీఎల్ సమయంలో కూడా హార్దిక్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువగా సెర్చ్ చేయబడిన క్రీడాకారుల జాబితాలో పాండ్య టాప్-10లో నిలిచాడు. ఇక భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రపంచ కప్ ను భారత్ కు అందించిన కెప్టెన్ గా రోహిత్ ఫైనల్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన కోహ్లీ అనంతరం వీరిరువురూ టీ20 క్రికెట్ నుండి వైదొలగడం వంటివి కూడా ఈ ఏడాది వార్తల్లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాయి.
Previous Articleఆ వ్యాఖ్యలు తనవి కావని స్పష్టం చేసిన మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే
Next Article భారత్-శ్రీలంక సంబంధాలు మరింత బలపడతాయి: ప్రధాని మోడీ