శ్రీలంక అధ్యక్షులు అనుర కుమార దిసనాయకే భారత్ లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిపై సమీక్షించారు. వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది, భద్రతా సహకారంపై చర్చలు జరిపారు. ప్రధాని మోడీతో భేటీ అయి చర్చించారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో ఈరోజు వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానం మరియు ఇంధనం వంటి అంశాలపై చర్చలు జరిగాయని ప్రధాని మోడీ తెలిపారు. గృహనిర్మాణం, వ్యవసాయం, పాడి పరిశ్రమ మరియు మత్స్య పరిశ్రమ వంటి రంగాలలో సహాకరించుకునే అంశాలపై కూడా చర్చలు జరిపారు.
ఇక ఉగ్రవాదం మరియు వ్యవస్థీకృత నేరాలపై పోరాటాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం మరియు శ్రీలంక కూడా కలిసి పనిచేస్తాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. సముద్ర భద్రత, సైబర్ సెక్యూరిటీ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ పై కూడా దృష్టి పెట్టనున్నట్లు వివరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు