‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ ప్రణాళిక నేడు పార్లమెంటు ముందుకు వచ్చింది. లోక్ సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశించిన ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టింది. దీని కోసం ప్రతిపాదించిన 128వ రాజ్యంగ సవరణ బిల్లు సహా దీనిని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఎన్డీయే మిత్ర పక్షాలు బిల్లుకు మద్దతు తెలుపగా… కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీ సహా విపక్ష పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. ఓటింగ్ లో 269 మంది అనుకూలంగా ఓటేయగా…198 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఇక ఈ బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సభకు తెలిపారు. పలువురు విపక్ష ఎంపీలు ఈ బిల్లుపై విమర్శలు గుప్పించారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

