అశ్లీల చిత్రాల నిర్మాణం,ప్రసారం చేశారనే ఆరోపణలతో ప్రముఖ వ్యాపార వేత్త రాజ్‌కుంద్రా కొంతకాలం పాటు జైలులో ఉండి విడుదలైన విషయం తెలిసిందే.ఈ కేసును ఉద్దేశించి తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరున్నారో తనకు తెలుసని అన్నారు.దీని వెనక కచ్చితంగా ఒకరు ఉన్నారు.ఈ దేశంలో మనం గొప్ప వ్యాపారవేత్తలుగా ఉంటున్నామంటే స్నేహితులతో పాటు శ్రతువులు కూడా ఉంటారు.నాకు వ్యాపార ప్రత్యర్థి ఉన్నారు.నేను పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు కొందరు వ్యక్తులు నన్ను కలిసి అతడి గురించి చెప్పారు.అప్పుడే అతడి గురించి నాకు పూర్తిగా అర్థమైంది.నెమ్మదిగా అన్ని విషయాలు వెల్లడయ్యాయి.ఎంతో బాధపడ్డాను.వారి పేర్లు చెబుతూ సీబీఐకు లేఖ రాశాను.త్వరలోనే విచారణ ప్రారంభిస్తారని ఆశిస్తున్నా.నా పేరును చెడగొట్టాలనే ప్రయత్నంతోనే ఇదంతా చేశారని అర్థమైంది’’ అని అన్నారు.తాను ఇప్పటి వరకూ ఎలాంటి పోర్న్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయలేదని అన్నారు.తనపై ఆరోపణలు వచ్చినప్పడు మానసిక క్షోభకు గురయ్యానని తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు