భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టు డ్రాగా ముగిసింది. వర్షం కారణంగా చివరి రెండు సెషన్ల ఆట సాధ్యం కాలేదు దీంతో అంపైర్లు మ్యాచ్ డ్రాగా ప్రకటించారు. దీంతో 5 టెస్టుల ఈ సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఓవర్ నైట్ స్కోర్ 252-9 తో ఐదోరోజు ఆట ప్రారంభించిన భారత్ 260 పరుగులకు ఆలౌటయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి 89 పరుగులు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కమ్మిన్స్ (22), అలెక్స్ క్యారీ (20నాటౌట్), హెడ్ (17), ఖవాజా (8), స్మిత్ (4), లబుషేన్ (1),మార్ష్ (2) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, ఆకాష్ దీప్ 2 వికెట్లు తీశారు. ఇక మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి మొత్తం భారత విజయ లక్ష్యం 275 పరుగులు కాగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 8-0 వద్ద ఉన్నప్పుడు వాతావరణ పరిస్థితుల కారణంగా ఆట నిలిపి వేశారు. ఇక తిరిగి ఆట ప్రారంభించే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఇరు జట్ల స్కోర్ వివరాలు:
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 445-10.
భారత్ మొదటి ఇన్నింగ్స్: 260-10
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్:89-7 (డిక్లేర్డ్)
భారత్ రెండో ఇన్నింగ్స్:8-0.
Previous Articleసంధ్య థియేటర్ ఘటన సీపీ సీరియస్
Next Article బైడెన్ రూల్స్.. ట్రంప్ కొనసాగించాలి