తాజాగా ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల్లో ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు ‘ దీపిక ’ అభ్యుదయ వ్యాస సంపూటికి గాను పురస్కారం దక్కింది. పల్నాడు జిల్లా చెరువుకొమ్ముపాలెంకు చెందిన శ్రీ పెనుకొండ లక్ష్మీనారాయణ అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడుగా ఉన్నారు. ఈ పురస్కారం పొందిన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకోబోతున్న ప్రముఖ రచయిత శ్రీ పెనుకొండ లక్ష్మీనారాయణకు అభినందనలు. ఆయన రచించిన ‘దీపిక’ అభ్యుదయ వ్యాస సంపుటికి సాహితీ విమర్శ క్యాటగిరిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం సంతోషకరం. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన ఆయనకు మరొక్కమారు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
Previous Articleపుష్ప రాజ్ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
Next Article అవినీతి కేసు.. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడికి ఎదురుదెబ్బ