ప్రస్తుతం సూపర్ ఫామ్ లో కొనసాగుతున్న భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంథాన టీ20 క్రికెట్ లో మరో రికార్డుకు చేరువలో ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో సెంచరీ సాధించిన ఆమె వెస్టిండీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో రెండు హాఫ్ సెంచరీలు చేసింది. మరో 34 పరుగులు చేస్తే టీ20లలో ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డు నెలకొల్పనుంది. నేడు వెస్టిండీస్ తో జరుగనున్న మూడో టీ20లో ఆమె ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. చమరి ఆటపట్టు 2024లో 21 మ్యాచ్ లలో 720 పరుగులతో ముందుంది. ఇషా ఓజా 20 మ్యాచ్ లలో 711 పరుగులు. హేలీ మ్యాథ్యూస్ 14 మ్యాచ్ లలో 700 పరుగులు. కనిషా 27 మ్యాచ్ లలో 696 పరుగులు చేసింది. స్మృతి మంథాన 22 మ్యాచ్ లలో 686 పరుగులతో తర్వాత స్థానంలో ఉంది. మరో 34 పరుగులు చేస్తే ఆమె ఈ జాబితాలో అత్యుత్తమ స్థానం దక్కించుకున్న బ్యాటర్ గా నిలుస్తుంది.
Previous Articleకేరళలో మంకీ ఫాక్స్ కలకలం.. రెండు కేసులు నమోదు
Next Article పార్లమెంటు ఆవరణలో గందరగోళం: బీజేపీ ఎంపీకి గాయాలు