ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ సమావేశానికి హాజరయ్యారు. కాగా, ఈసమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో అమరావతి నిర్మాణం కోసం ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిర్ణయించారు. హడ్కో ద్వారా రూ.11వేల కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతి. రాష్ట్రంలోని 475 జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజనం అందించేందుకు ఆమోదం. 1.41 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. జర్మనీకి చెందిన కేఎఫ్ డబ్ల్యూ ద్వారా రూ.5వేల కోట్ల రుణానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 45 పనులకు రూ.33వేల కోట్ల నిధులు ఖర్చు చేసేందుకు సీఆర్డీఏకు అనుమతి. బుడమేరు, పది జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్కు ఆమోదం.
ధాన్యం కొనుగోలు కోసం మార్కెఫెడ్ ద్వారా రూ.వెయ్యి కోట్ల రుణానికి ఆమోదం. పోలవరం ఎడమ కాల్వ రీటెండర్ కు అనుమతి. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు ఆమోదం తెలిపింది. క్లీన్ ఎనర్జీ కోసం ఎన్టీపీసీ ద్వారా పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు వంటి నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
Previous Articleపుష్ప 2 తో పోటీ.. అట్లీ ఏమ్మన్నారంటే
Next Article ఫార్ములా ఈ రేసులో కేసు.. కేటీఆర్ ఏమన్నారంటే