ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ బ్యాంక్ శుభవార్త తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది.ప్రపంచ బ్యాంక్ బోర్డు సమావేశం నిన్న జరిగింది.ఈ సమావేశంలో అమరావతి నిర్మాణానికి 800 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం.ఏపీ రాజధాని అమరావతికి ఇప్పటికే ఏడీబీ 788 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది.
అమరావతి నిర్మాణానికి నిధులు ఇస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటన చేసింది. ప్రపంచ బ్యాంక్,ఏడీబీల ద్వారా నిధులు సమకూరుస్తామని తెలిపింది.ఈ రెండు సంస్థల ద్వారా 1588 మిలియన్ డాలర్ల నిధులు సమకూరుస్తామని పేర్కొంది.ఈ మేరకు భారత ప్రభుత్వ సిఫార్సుతో రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది.