నేడు మన్యం పార్వతీపురం జిల్లాలో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు.
సాలూరు నియోజకవర్గం, మక్కువ మండలం, పనసభద్ర పంచాయతీలో జరిగే అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇకపై గిరిజన గ్రామాల్లో డోలీల బాధలు ఉండకూడదు అనే లక్ష్యంతో 55 గిరిజన ప్రాంతాలను కలిపేలా, 3,782 మంది గిరిజనులు కష్టాలు తీర్చేలా, రూ.36.71 కోట్ల వ్యయంతో, 39.32 కి.మీ మేర రహదారుల నిర్మాణం ప్రభుత్వం చేపట్టనుంది. ఇక ఈ పర్యటనలో పవన్ బాగుజోల నుంచి చిలకల మండంగి వైపు కొండపైకి నడుచుకొంటూ వెళ్ళారు. అక్కడి గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. గిరిజన ప్రజలందరికీ, మన్యం ప్రాంతం ప్రజలందరి కోసం అహర్నిశలు ఎండనకా, వాననకా కష్టపడటానికి సంసిద్ధంగా ఉన్నామని కూటమి ప్రభుత్వం తరఫున మాట ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రుషికొండ ప్యాలెస్ కి 500 కోట్లు ఖర్చుపెట్టారు కానీ.మన గిరిజన ప్రాంతం బాగుజోలలో 9.50 కోట్లతో రోడ్లు వేయలేకపోయారని గత వైసీపీ ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. ఇక్కడికి తాను కేవలం రోడ్ల కోసమే రాలేదన్న పవన్ ఇక్కడి వారి కష్టాలు బాధలు తెలియాలి., యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటే ఎలాంటి నైపుణ్యం మీకు కావాలి అనేవి తెలుసుకోవాలని అన్నారు. 5 సంవత్సరాల తరువాత కోసం కాదని వచ్చే సంవత్సరం లోపు ఏమి చేస్తే బాగుంటది అని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. మీ అభివృద్ధి నాకు చాలా అవసరం.మీరు ఆనందంతో ఉండాలి.స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ళ తరువాత ఇంకా కూడా మందులకు, రోడ్లకు, ఉపాధి అవకాశాలకు బాధ పడుతుంటే చలించే వ్యక్తిని నేనున్నాను, స్పందించే వ్యక్తి సీఎం చంద్రబాబు ఉన్నారని అలాగే మీకు న్యాయం చేయడానికి ప్రధాని మోడీ ఉన్నారని పవన్ తెలిపారు.
గిరిజనుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
By admin1 Min Read
Previous Articleరోషన్ కనకాల కొత్త చిత్రానికి క్లాప్ కొట్టిన సందీప్ రెడ్డి వంగ…!
Next Article వారాన్ని నష్టాలతో ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు