భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా సిరీస్ లో కీలకమైన నాలుగో టెస్టు జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్ లలో ఇరు జట్లు 1-1తో ఉన్నాయి. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచి ఆధిక్యంలోకి వెళ్లాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. కాగా, ఈ మ్యాచ్ లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి
మెల్ బోర్న్ మైదానంలో సరికొత్త చరిత్రను సృష్టించేందుకు విరాట్ కోహ్లి చేరువలో ఉన్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టేందుకు చేరువయ్యాడు. ఎంసీజీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 449 పరుగులతో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అజింక్యా రహానె 369 పరుగులతో ద్వితీయ స్థానంలో 316 పరుగులతో విరాట్ కోహ్లి మూడో స్థానంలో ఉన్నాడు. నాలుగో టెస్టు మ్యాచ్ లో మరో 134 పరుగులు సాధిస్తే సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ అధిగమిస్తాడు.
మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో అత్యధిక పరుగుల భారత బ్యాటర్లు
1. సచిన్ టెండూల్కర్- 449
2. అజింక్యా రహానె – 369
3. విరాట్ కోహ్లి- 316
4. వీరేంద్ర సెహ్వాగ్- 280
5. రాహుల్ ద్రావిడ్- 263.

