భారత మహిళా క్రికెట్ జట్టు విజయ పరంపర కొనసాగుతోంది. స్వదేశంలో వెస్టిండీస్ పై ఇటీవలే టీ20 సిరీస్ ను 2-1తో గెలిచుకున్న సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తాజాగా వడోదర వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ లో 211 పరుగుల తేడాతో రికార్డు స్థాయిలో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. స్మృతి మంథాన 91 (102;13×4), హార్లీన్ డియోల్ 44 (50,2×4, 1×6), ప్రతీక రావల్ 40(69;4×4), హార్మన్ ప్రీత్ 34 (23, 3×4, 1×6), జెమీమా రోడ్రిగ్స్ 31(19;3×4,1×6) పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. విండీస్ బౌలర్లలో జైదా జేమ్స్ 5 వికెట్లు పడగొట్టింది. హేలే మ్యాథ్యూస్ 2 వికెట్లు, డాటిన్ 1 వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 26.2 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటయింది. ఫ్లెచర్ 24 నాటౌట్ టాప్ స్కోరర్. క్యాంప్ బెల్ (21) పరుగులు చేసింది. మిగతా బ్యాటర్ లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో రేణుకా ఠాకూర్ సింగ్ 5 వికెట్లతో సత్తా చాటింది. ప్రియా మిశ్రా 2 వికెట్లు, దీప్తి శర్మ ఒక వికెట్, టైటాస్ సందు ఒక వికెట్ తీశారు. వన్డేల్లో పరుగుల పరంగా ఇది భారత్ కు రెండో అతి పెద్ద విజయం.
Previous Articleఅండర్-19 మహిళల ఆసియా కప్ టైటిల్ విజేత భారత్
Next Article ప్రపంచ రికార్డు సృష్టించిన నారా దేవాన్ష్