ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ చెస్ లో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ ను వేగంగా పరిష్కరించి ‘ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్-175 పజిల్స్’ రికార్డును సృష్టించాడు. కేవలం తొమ్మిదేళ్ల వయసులోనే ఈ ఘనత అందుకున్నాడు. దీంతోపాటు దేవాంశ్ సాధించిన మరో రెండు రికార్డులను ప్రతిష్ఠాత్మక ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ – లండన్’ అధికారికంగా ధ్రువీకరించింది.
వ్యూహాత్మకమైన – ఆటతీరుతో 11 నిమిషాల 59 సెకన్లలో చెక్ మేట్ పజిల్స్ పూర్తిచేసి దేవాంశ్ ప్రపంచ రికార్డు సాధించాడు. “5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్” అన్న పుస్తకం నుంచి తీసుకున్న పజిల్స్ ఈ పోటీని రూపొందించారు. దేవాంశ్ ఇటీవల 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోమ్ని కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పూర్తిచేశాడు. అలాగే, 9 చెస్బోర్డుల్ని కేవలం 5 నిమిషాల్లో సెట్ చేశాడు.
లోకేష్ ఈ ఘనత సాధించడం పట్ల కుటుంబ సభ్యులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలువురు నేతలు కూడా దేవాన్ష్ ఘనత పట్ల అభినందిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Overjoyed to share that @naradevaansh has achieved the World Record for 'Fastest Checkmate Solver – 175 Puzzles'! We're thrilled to receive official confirmation from the prestigious World Book of Records, London. Witnessing Devaansh's dedication & perseverance over the years has… pic.twitter.com/Xgn0tMZMlM
— Brahmani Nara (@brahmaninara) December 22, 2024