ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం చదువుతూ సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థుల అభ్యర్థన మేరకు తత్కాల్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నిర్ణీత రుసుముతో ఈ నెల 31 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. వివిధ కారణాలవల్ల పరీక్ష ఫీజు చెల్లించని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నట్లు లోకేష్ ట్వీట్ చేశారు.
ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం చదువుతూ సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థుల అభ్యర్థన మేరకు తత్కాల్ పథకాన్ని ప్రవేశపెట్టాము. నిర్ణీత రుసుముతో ఈ నెల 31 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించాం. వివిధ కారణాలవల్ల పరీక్ష ఫీజు చెల్లించని అభ్యర్థులు ఈ అవకాశాన్ని… pic.twitter.com/CzNxVl9NVO
— Lokesh Nara (@naralokesh) December 23, 2024