రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందక.. చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మరికొందరు ఇతర రంగాల వైపు మొగ్గు చూపుతున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయ రంగం తీవ్ర గడ్డు పరిస్థితి ఎదురుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందరి కడుపు నింపే రైతన్నలు.. తమ కడుపు నింపుకోవడానికి మాత్రం నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. గతంలో ఉన్న జగన్ ప్రభుత్వం కానీ.. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ కానీ రైతుల సమస్యలు పట్టించుకోకుండా కార్పొరేటర్లకు కొమ్ముకొస్తున్నాయని షర్మిల ఆరోపించారు.
స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డులలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి రైతులు మార్కెట్ యార్డుకు తెచ్చుకున్న సరుకులకు తగిన భద్రత కల్పించాలి. కౌలు రైతులను ఆదుకోవాలి.పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం రూ.20వేలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. తక్షణమే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని.. అలాగే రాష్ట్రంలో రైతుల సమస్యలు తీర్చాలని.. కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన ఉద్యమం చేపడతామన్నారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

