Author: Indu

అక్టోబరు 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో తాజాగా అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రేపటికి వాయుగుండంగా మారుతుందని, అక్టోబరు 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ తుపాను వాయవ్య దిశగా పయనిస్తుందని, అక్టోబరు 24 ఉదయం ఒడిశా-బెంగాల్ తీరాలకు అనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని ఏపీఎన్డీఎంఏ పేర్కొంది. అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అక్టోబరు 22 నుంచి 25 వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, సముద్రంలో ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తీరానికి చేరుకోవాలని ఏపీఎన్డీఎంఏ స్పష్టం చేసింది. ప్రభావిత ప్రాంతాల్లోని…

Read More

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా ఆయన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. ఈసందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.రూ.67 వేల కోట్లతో 23 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆర్.జె శంకర్ నేత్ర చికిత్సాలయాన్ని ప్రారంభించారు.వారణాసిలోని శ్రీ కంచి పీఠాన్ని సందర్శించి అక్కడ హిందూ ధర్మానికి సంబంధించి నెలకొల్పిన ప్రదర్శనను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా కంచి పీఠాధిపతులు ప్రధాని మోడీకి ప్రత్యేక ఆశీర్వాదాలు అందించారు.

Read More

ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్ చేరిన భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి రజత పతకంతో సరిపెట్టుకుంది. చైనా క్రీడాకారిణి లిజియామన్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. లి ప్రతి రౌండ్లో ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో 0-6 తేడాతో దీపికాపై విజయం సాధించిన లి జియామన్ పసిడి పతకాన్ని సాధించింది. భారత్ తరపున ఇప్పుటి వరకు తొమ్మిదిసార్లు వరల్డ్ కప్ ఫైనల్లో పోటీ పడి ఐదు రజతాలను సొంతం చేసుకున్న దీపికా ఒక కాంస్య పతకం కూడా సాధించింది. భారత్ తరఫున డోలా బెనర్జీ మాత్రమే బంగారు పతకం సాధించింది.

Read More

భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీ ప్రాక్టీస్ ను ముమ్మరం చేశాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత ఈ పేసర్ మళ్లీ బరిలో దిగలేదు. ఇక తిరిగి జుట్టులోకి పునరాగమనం కోసం షమి నెట్స్ లో కష్టపడుతున్నాడు. ఈ ఏడాది మొదట్లో మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకున్న షమీ సాధన ప్రారంభించాడు. బెంగళూరులో భారత్- న్యూజిలాండ్ తొలి టెస్టు ముగిసిన తర్వాత నెట్లోకి అడుగుపెట్టి భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఆధ్వర్యంలో సాధన చేశాడు. భారత సహాయక కోచ్ అభిషేక్ నాయర్కు చాలా సేపు బంతులు వేశాడు. కొంతసేపు ఫీల్డింగ్ డ్రిల్స్ కూడా చేశాడు. ఈ సెషన్ ముగిశాక మోర్కెల్ షమి సుదీర్ఘంగా మాట్లాడాడు.

Read More

విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఆర్ఎస్ రైల్వే స్టేషన్ సమీపంలో చంపావతి నది పై ఉన్న రక్షిత మంచి నీటి పథకం పంపింగ్ హౌస్ ను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అతిసారం ప్రబలిన గుర్ల గ్రామంతో పాటు పరిసర గ్రామాలకు ఈ పంపింగ్ హౌస్ నుంచే నీటి సరఫరా అవుతుందని అధికారులు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశారు. నీటి శుద్ధి ప్రక్రియ, రక్షిత మంచి నీరు సమీప గ్రామాలకు అందుతున్న తీరును అధికారులు వారికి వివరించారు. నీటి కాలుష్యం ఎక్కడ అవుతుందన్న దానిపై పవన్ ఆరా తీశారు. నీటి శుద్ధి విషయంలో జాగ్రత్తలు పాటించాలని రక్షిత మంచినీటి సరఫరా శాఖ అధికారులకు, జల వనరుల శాఖ అధికారులకు పవన్ స్పష్టం చేశారు. పాతకాలంనాటి ఫిల్టర్ బెడ్లు, మంచి నీటి సరఫరా వ్యవస్థ మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, వాటికి అవసరమైన మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలని ఈసందర్భంగా…

Read More