Author: Indu

AMC చైర్మన్ గా మండలంలోని పిడూరు పాలెం గ్రామానికి చెందిన గాలి రామకృష్ణ రెడ్డి ఎంపికైనట్లు ఆ పార్టీ నాయకులు సోమవారం రాత్రి తెలిపారు. గాలి రామకృష్ణారెడ్డి గత 30 సంవత్సరాలుగా టీడీపీ మండల అధ్యక్షుడుగా ఉంటూ పార్టీ అభివృద్ధికి పాటుపడ్డారు. ఆయన చేసిన సేవలకు గాను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏఎంసీ ఛైర్మన్‌గా నియమించారు. దీనితో పలువురు ఆయనను అభినందించారు.

Read More

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో నిర్వహించిన డాక్టర్ అఖిలేష్ దాస్ గుప్తా మెమోరియల్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ షటిల్ బాడ్మింటన్ క్రీడా పోటీల్లో గూడూరు క్రీడా కారుడు షేక్ గౌస్ సత్తా చాటాడు. హోరాహోరీగా సాగిన షటిల్ పోటీల్లో ద్వితీయ స్థానాన్ని సాధించాడు. షేక్ గౌస్ – ప్రకాష్ రాజ్ జట్టు రన్నర్స్‌గా నిలిచింది. ప్రథమ స్థానంలో శివం శర్మ, సంతోష్ జట్టు నిలిచింది. గూడూరు క్రీడాకారులను పలువురు అభినందించారు.

Read More

కడప జిల్లాలో మూడు రోజుల పాటు మాజీ సీఎం జగన్ పర్యటన ఖరారైంది. బుధవారం తెనాలి నుంచి బద్వేలుకు చేరుకుంటారు. అక్కడ ఉన్మాది చేతిలో బలైన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం బ్రహ్మంగారి మఠం చేరుకుని వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం పులివెందుల చేరుకుని గురువారం, శుక్రవారం కార్యకర్తలకు జగన్ అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Read More

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(D.El.Ed) విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఈ మేరకు టైంటేబుల్‌ను ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి.దేవానందరెడ్డి విజయవాడలోని తన కార్యాలయంలో విడుదల చేశారు. నవంబర్ 4,5,6,7 తేదీలలో ఉదయం 9- 11.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, 2023- 25 బ్యాచ్‌తో పాటు 2022- 24, 2021- 23లలో ఫెయిలైనవారు ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుందని దేవానందరెడ్డి తెలిపారు.

Read More

మచిలీపట్నం వైద్య కళాశాలకు పింగళి వెంకయ్య పేరు పెట్టినందుకు సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశప్రజలలో స్ఫూర్తి నింపేలా జాతీయ జెండాను పింగళి వెంకయ్య రూపొందించారని పవన్ వ్యాఖ్యానించారు. అలాంటి మహనీయుడి పేరు మచిలీపట్నం వైద్య కళాశాలకు పెట్టడం హర్షణీయమన్నారు.

Read More

భారీ అంచనాల మధ్య విడుదలై ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న చిత్రం దేవర. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఈ మూవీ ఇప్పటికే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దేవర.. కొన్ని రోజులుగా బాక్సాఫీస్ వద్ద మారుమోగుతున్న పేరు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. ట్రిపుల్ ఆర్ సినిమా తర్వా జూనియర్ ఎన్టీఆర్ సోలోగా నటించిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఇందులో తండ్రికొడుకుల పాత్రలో ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు తారక్. అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, శ్రుతి మరాఠే, చైత్ర…

Read More

రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్’ మాళవికా మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ లు ఇతర ముఖ్య తారాగణం. చిత్ర బృందం తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న రాయల్ ట్రీట్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.టీజర్/ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. స్టైలిష్ లుక్ లో రెబల్ స్టార్ అదరగొడుతున్న పోస్టర్ కు అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది.

Read More

భారత్ సాధించిన డిజిటల్ విప్లవంపై ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ పాల్ మైకేల్ రోమెర్ ప్రశంసల వర్షం కురిపించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం డిజిటల్ విప్లవాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగిందని పేర్కొన్నారు. భారత డిజిటల్ విప్లవం అత్యంత స్ఫూర్తిదాయకమైన, ఆసక్తికరమైన విజయగాథల్లో ఒకటిగా ఆయన అభివర్ణించారు. ఈ డిజిటల్ విప్లవం ప్రజల జీవితాలను సులభతరం చేయడమే కాకుండా, మిగిలిన ప్రపంచానికి ఒక గొప్ప ఉదాహరణలా నిలిచిందని అభివర్ణించారు. ప్రపంచ శక్తులకు సరికొత్త ప్రమాణాలను నిర్దేశించిందని అన్నారు. ప్రొఫెసర్ పాల్ రోమెర్ గతంలో ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనామిస్ట్ గా వ్యవహరించారు. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన ఆలోచనలు పంచుకున్నారు.

Read More

నాడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అద్భుతంగా అమలు చేస్తే.. సొంత కొడుకై ఉండి జగన్ మోహన్ రెడ్డి గారు తన హయాంలో పథకాన్ని నీరు గార్చారని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటని ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడారు. తల్లిదండ్రులను మనోవేదనకు గురి చేశారని దోచుకొని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ, విద్యార్థుల సంక్షేమం మీద పెట్టలేదని మండిపడ్డారు. వైఎస్ మానస పుత్రిక ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. మహానేత హయాంలో, కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఒక ప్రతిష్ఠాత్మక పథకం.పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి, ఎంతో మంది ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసిన గొప్ప పథకమని కొనియాడారు. నాడు వైసీపీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చి నిర్వీర్యం చేయాలని చూస్తే.. నేడు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం…

Read More

ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా అర్హులకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు చేపట్టినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం కింద చేపట్టే నిర్మాణాలపై గుంటూరులోని ఆర్అండ్ బీ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమాలకు తావు లేకుండా అర్హులకు ‘ఆవాస్’ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా రెండు కోట్ల నూతన గృహాల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న గృహాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పెమ్మసాని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్, హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్, జిల్లా కలెక్టర్, గృహనిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Read More