IPL-2025లోనూ హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వహించనున్నారు. ఈక్రమంలో కెప్టెన్లకే కెప్టెన్ అంటూ పాండ్య అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. IPLలో ముంబై ఇండియన్స్ జట్టులో భారత వన్డే& టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, టెస్ట్ వైస్ కెప్టెన్ బుమ్రా, ఎమర్జింగ్ టీ20 కెప్టెన్ తిలక్ వర్మ ఉన్నారు. గతేడాది నుంచి MI కెప్టెన్‌గా పాండ్య వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Author: Indu
దేశంలో డిజిటల్ ప్రకటనలకు డిమాండ్ పెరుగుతోంది. ఆన్‌లైన్ ద్వారా తమ వస్తువులు, ఉత్పత్తుల ప్రచారానికి వ్యాపారులు పెద్దపీట వేస్తున్నారు. Google India ఆదాయం FY24లో గత ఏడాదితో పోల్చితే 26% పెరిగి రూ.5,921 కోట్లుగా నమోదవ్వడమే అందుకు నిదర్శనం. భారత్‌లో డిజిటల్ అడాప్షన్ పెరగడంతో ప్రకటనల్లో వృద్ధి, ఎంటర్‌ప్రైజ్ ఉత్పత్తుల విక్రయాలు ఈ పెరుగుదలకు కారణమని సంస్థ తెలిపింది.
ఉద్యోగంలో ఏకాగ్రత లోపిస్తోందా? రోజూ 8-9 గంటలు పనిచేస్తుండటంతో నిద్రమత్తు కమ్మేస్తోందా? ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు కొన్ని చిట్కాలను వైద్యులు తెలియజేశారు. సుదీర్ఘ పని రోజుల్లో శ్రద్ధ, దృష్టి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి ఇలా చేయండి. పని మధ్యలో శారీరక శ్రమ కోసం 10 నిమిషాలు నడవండి. ఫ్రెండ్స్‌తో కాఫీకి వెళ్లి రండి. సూర్యరశ్మి, ప్రకృతితో ఓ పది నిమిషాలు గడపండి. 10-20 నిమిషాలు చిన్న కునుకు తీయండి.
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తర్వాత ఆయనను జట్టు కెప్టెన్‌గా నియమిస్తారని సమాచారం. అయ్యర్ కోసం ఢిల్లీ భారీ మొత్తం వెచ్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే జీఎంఆర్ గ్రూప్ అతనికి హామీ ఇచ్చినట్లు టాక్. కాగా గత సీజన్‌లో కేకేఆర్‌కు అయ్యర్ టైటిల్ సాధించిపెట్టినా ఆ ఫ్రాంచైజీ అతడిని వదిలేసింది.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పట్టుబిగించింది. కివీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. ఇవాళ ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 171/9 రన్స్ చేసింది. ఓవరాల్‌గా 143 పరుగుల లీడ్‌లో ఉంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలం ధాటికి కివీస్ బ్యాటర్లు పరుగులు రాబట్టలేకపోయారు. విల్ యంగ్ (51) ఒక్కరే అర్ధ సెంచరీ సాధించారు. జడేజా 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు.
PhonePe Diwali insurance : దీపావళిలో బాణాసంచా వల్ల ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే? అన్న ఆందోళనలో ఉన్నారా? అయితే.. మీకు ఫోన్‌పే కొత్త ఇన్సూరెన్స్ బెస్ట్! హాస్పిటల్ ఖర్చుల కోసం రూ. 9 ప్రీమియంతో రూ. 25వేల వరకు కవరేజ్ ఇస్తోంది ఫోన్‌పే. పూర్తి వివరాలు.. దీపావళి నేపథ్యంలో యూపీఐ పేమెంట్స్ దిగ్గజం ఫోన్‌పే కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్‌ని తీసుకొచ్చింది. బాణాసంచా కాల్చుతున్న సమయంలో ప్రమాదవశాత్తు గాయాలైతే, హాస్పిటల్ ఖర్చులకు ఉపయోగపడే విధంగా ఈ ‘ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్’ని ఫోన్‌పే లాంచ్ చేసింది. ఇందులో రూ. 9 కడితే, రూ. 25వేల వరకు బీమా కవరేజ్ లభిస్తుంది. ఈ ఫోన్‌పే కొత్త ఇన్సూరెన్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 73 పాయింట్లు పడి 81,151 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 73 పాయింట్లు కోల్పోయి 24,781 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 131 పాయింట్ల నష్టంతో 51,963 వద్దకు చేరింది.
Mahindra XUV 3xo EV : మహీంద్రా సరికొత్త ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ భారత మార్కెట్లో విజయవంతమైంది. ఈ కంపెనీ పోర్ట్ ఫోలియోలో అత్యధికంగా అమ్ముడైన మూడో కారుగా నిలిచింది. ఇప్పుడు ఈ మోడల్ నుంచి ఎలక్ట్రిక్ వెర్షన్ రాబోతోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఇండియన్ మార్కెట్లో మంచి విజయాన్ని అందుకుంది. కంపెనీ పోర్ట్ ఫోలియోలో అత్యధికంగా అమ్ముడైన మూడో కారుగా ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ తన ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కస్టమర్లకు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఎక్స్‌యూవీ ఎలక్ట్రిక్ మోడల్ టెస్టింగ్ సమయంలో కనిపించింది. బయటకు వచ్చిన వివరాల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ ఎక్స్టీరియర్, ఇంటీరియర్, ఫీచర్ల గురించి కొన్ని కొత్త వివరాలు వెల్లడయ్యాయి. వచ్చే ఏడాది దీన్ని లాంచ్ చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం.
Hyundai IPO listing : హ్యుందాయ్ మోటార్ ఇండియా షేర్లు మంగళవారం స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యాయి. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా పేరొందిన హ్యుందాయ్.. మదుపర్లకు నష్టాల్ని మిగిల్చింది. దేశంలోనే అతిపెద్ద ఇష్యూగా పేరొందిన హ్యుందాయ్ మోటార్ ఐపీఓ మంగళవారం స్టాక్ మార్కెట్లో ఫ్లాట్‌గా లిస్ట్ అయ్యింది. ఇష్యూ ప్రైజ్‌తో (రూ.1960) పోల్చితే, బీఎస్ఈలో ఈ హ్యుందాయ్ స్టాక్ రూ. 26 నష్టంతో 1934 వద్ద, ఎన్ఎస్ఈలో రూ. 29 నష్టంతో 1931 వద్ద లిస్ట్ అయ్యింది. అంటే మదుపర్లకు ఈ ఐపీఓ 1.3శాతం నష్టాన్ని మిగిల్చినట్టు!
Bengaluru rain update : భారీ వర్షాలు బెంగళూరులో విధ్వంసాన్ని సృష్టించాయి. అనేక రోడ్లు జలమయం అయ్యాయి. పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరోవైపు వర్షాల కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.