వ్యక్తిగత అవసరాల కోసం ప్రజలు,వాణిజ్య సంస్థలు తమ డెలివరీ సిబ్బంది కోసం విద్యుత్తు వాహనాలను కొనుగోలు చేయడం పెరిగింది.శబ్దం చేయకపోవడం, పొగను వెదజల్లకపోవడం,సంప్రదాయ ఇంధన వాహనాలతో పోలిస్తే,వీటి నిర్వహణ వ్యయం తక్కువ కావడం ఇందుకు ఉపకరిస్తోంది.2024 మొత్తంమీద 11,48,415 విద్యుత్తు ద్విచక్ర వాహనాలు విక్రయమయ్యాయని కంపెనీల గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.2023లో విక్రయమైన 8,60,418 వాహనాలతో పోలిస్తే, గతేడాది అమ్మకాలు 33% పెరిగాయి 2023 డిసెంబరుతో పోలిస్తే, గత నెలలో వీటి విక్రయాలు 2,600 మేర తగ్గినా.. పండగ సీజన్‌లో అధికంగా అమ్ముడవ్వడం కలిసొచ్చింది. విద్యుత్తు ద్విచక్ర వాహన విక్రయాల్లో బజాజ్ ఆటో, టీవీఎస్, ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అగ్రగామి సంస్థలుగా ఉన్నాయి. దాదాపు 25 సంస్థలు దేశంలో విద్యుత్తు ద్విచక్ర వాహనాలను గుర్తించదగ్గ రీతిలో విక్రయిస్తున్నాయి..
Previous Articleఫిష్ వెంకట్‌కు పవన్ సాయం..థ్యాంక్స్ చెప్పిన నటుడు
Next Article విశాఖపట్నం జైలు హౌస్ ఫుల్ల్…!