దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఆరో రోజు సూచీలు నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. ఒకానొక దశలో భారీ నష్టాలకి జారిన సూచీలు తిరిగి పుంజుకుని స్వల్ప నష్టాలకు పరిమితమవడంతో మదుపర్లు ఊపిరిపీల్చుకున్నారు. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 122 పాయింట్లు నష్టపోయి 76,171గా స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 26 పాయింట్లు నష్టంతో 23,045 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.86.90 గా కొనసాగుతోంది. టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫిన్ సర్వ్, అల్ట్రా టెక్ సిమెంట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాలతో ముగిశాయి.
Previous Articleవిజయవాడలో భారీ అగ్ని ప్రమాదం…!
Next Article విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ టీజర్ విడుదల..!