దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ను నష్టాలతో ముగించాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. అమెరికా అనుసరిస్తున్న టారిఫ్ పాలసీలు, దాని వలన ఇన్ ఫ్లేషన్ పెరుగుతుందన్న ఊహాగానాలతో సూచీలు జోరు చూపలేకపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 203 పాయింట్లు నష్టపోయి 75,735గా స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 19.75 పాయింట్ల నష్టంతో 22,913 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.86.64గా కొనసాగుతోంది. మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
Previous Articleభారత్ అర్జెంటీనాల మధ్య లిథియం అన్వేషణ పై కీలక ఎంఓయూ
Next Article ప్రారంభమైన ‘ఎన్టీఆర్-నీల్’ చిత్రం