దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ ను నష్టాలతో ముగించాయి. ఉదయం ఒక ప్రారంభమైన మార్కెట్లు ఇన్వెస్టర్లు ఆఖర్లో లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నష్టాలతో ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 217 పాయింట్లు నష్టంతో 74,115 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 77 పాయింట్లు నష్టపోయి 22,460 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.87.29 కొనసాగుతోంది. సెన్సెక్స్ లో హిందూస్తాన్ యూనీలివర్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాలతో ముగిశాయి.
22,500 దిగువకు నిఫ్టీ… నష్టాలతో ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు
By admin1 Min Read