ప్రధాన షేర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 557 పాయింట్లు లాభంతో 76,905 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 159 పాయింట్లు లాభపడి 23,350 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.86.01గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30లో టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు, సన్ ఫార్మా, నెస్లే ఇండియా, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్ అండ్ టీ షేర్లు లాభాలతో ముగిశాయి.
Previous Articleఏప్రిల్ 3న ఏపీ మంత్రివర్గ సమావేశం..!
Next Article నటుడు పోసాని కృష్ణమురళికి కోర్టు బెయిల్ మంజూరు