నిన్నటి భారీ నష్టాల నుండి కోలుకుని తిరిగి సూచీలు లాభాలతో కళకళలాడాయి. టారిఫ్ ల అంశంలో ప్రపంచ దేశాలతో అమెరికా చర్చలకు సిద్ధమన్న సంకేతాల నేపథ్యంలో ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1089 పాయింట్ల లాభంతో 74,227 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 374 పాయింట్లు లాభపడి 22,535 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.86.28గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30లో పవర్ గ్రిడ్ షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లు లాభాలతో ముగిశాయి. మిగిలిన దేశాలతో పోలిస్తే అమెరికా టారిఫ్ ల ప్రభావం మన దేశం మీద పెద్దగా ప్రభావం చూపదన్న అంచనాలు ఇన్వెస్టర్లకు కొంత ఉపశమనం కలిగించాయి.
Previous Articleశరవేగంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు: పురోగతిని సమీక్షించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Next Article బీజేపీ లో చేరిన భారత మాజీ క్రికెటర్ …!