దేశంలోని కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులకు పలు బ్యాంకులు శుభవార్త అందించాయి. సేవింగ్స్ ఎకౌంటులో కనీస నిల్వ మినిమం బ్యాలెన్స్ లేకుంటే విధించే ఛార్జీలను పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేశాయి. ఈ నిర్ణయంతో సాధారణ, మధ్య తరగతి ప్రజలకు కొంత భారం తగ్గనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా మరిన్ని బ్యాంకులు ఈ జాబితాలో చేరాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈనెల జులై 1, 2025 నుండి తమ సాధారణ సేవింగ్స్ ఎకౌంటులకు ఈ ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ప్రీమియం ఖాతాలకు ఈ మినహాయింపు వర్తించదని స్పష్టం చేసింది. ఇదే దారిలో ఇండియన్ బ్యాంక్ కూడా జులై 7, 2025 నుంచి అన్ని రకాల పొదుపు ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కెనరా బ్యాంక్ కూడా ఈ సంవత్సరం మే నెలలో సాధారణ ఎకౌంటులో పాటు ఎన్ఆర్ఐ, శాలరీ ఎకౌంటులపై కూడా ఈ ఛార్జీని తొలగించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ కస్టమర్లకు ఊరటనిస్తూ ఇదే విధమైన నిర్ణయం తీసుకున్నాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కూడా గతంలోనే ఈ ఛార్జీలను రద్దు చేసింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు