మాజీ సీఎం, వైయస్ఆర్ సీపీ అధినేత జగన్ పులివెందులలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్భార్ నిర్వహించారు. ఈసందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులకు వైయస్ జగన్ భరోసానిచ్చారు. ప్రజాదర్భార్ లో కలిసిన వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
ఎవరూ అధైర్యపడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదంటూ భరోసా కల్పించారు. త్వరలోనే మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని పేర్కొన్నారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. కూటమి నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ని వర్గాలకు వైసీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్ ఛార్జీలపై ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా దీనిపై ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని ఆయన అన్నారు.
Previous Articleసీఎం పదవి వద్దన్నా : సోనూ సూద్
Next Article ఒక విశిష్ట వ్యక్తిని కోల్పోయాం:- ప్రధాని నరేంద్రమోదీ

