ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగం పుంజుకుంటున్నాయి. సీఆర్డీఏ ఈ పనులు వేగవంతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. అందులో భాగంగా అమరావతి లో పలు నిర్మాణ పనులకు ఏపీ సీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) టెండర్లను ఆహ్వానించింది. రూ.2,300 కోట్లకు టెండర్లను ఆహ్వానించింది.
సీఆర్డీఏ ద్వారా రూ.1470 కోట్లు, ఏడీసీ ద్వారా రూ.852 కోట్లతో వివిధ పనులు చేవట్టేందుకు టెండర్లు పిలిచాయి. టెండర్లు ఫైనలైజ్ అయ్యాక పలు జోన్లలో రహదారులు, తాగునీటి సరఫరా, పవర్ తదితర పనులు చేపట్టనున్నారు. అలాగే మరికొన్ని జోన్లలో నీరుకొండ రిజర్వాయర్ కు సంబంధించి బ్యాలెన్స్ ఫ్లడ్ మిటిగేషన్ నిర్మాణ పనులకు సైతం టెండర్లను పిలిచాయి. అయితే ఈ టెండర్లు వేసేందుకు తుది గడువు జనవరి 22గా ప్రభుత్వం నిర్ణయించింది.
Previous Articleఆంటోనీ తో ప్రేమ..అలా మొదలైంది : కీర్తి సురేష్
Next Article ఎన్నో సార్లు చచ్చిపోవాలనుకున్నా : దర్శకుడు