విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 35వ పుస్తక మహోత్సవాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలని అన్నారు. తాను కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా వెనుకాడను కానీ పుస్తకం ఇవ్వడానికి ఆలోచిస్తానని ఇంటర్ తో చదువు ఆపేసాను కానీ చదవడం ఆపలేదని పేర్కొన్నారు. చదవడం వల్ల మానసిక శక్తి ఏర్పడుతుందని చెప్పారు. మనం తెలుగు వారీగా పుట్టడం మన అదృష్టం. తెలుగు ఎంత గొప్ప భాష అంటే ఎవరికైనా తేలిగ్గా జ్ఞానోదయం చేసే గొప్ప సాహిత్యం ఉందని పేర్కొన్నారు. పాపులారిటీ ఉన్న ప్రతి వారు గొప్ప వారు కాదని జ్ఞానం ఉన్నవారు, రచయితలు గొప్ప వారని అన్నారు. పుస్తకం నచ్చిందా లేదా అని కాదు. అసలు ఒక పుస్తకంలో ఒక పేజీ రాయడం ఎంత కష్టమో అర్థం చేసుకుంటే రచయితలపై గౌరవం కలుగుతుందని పేర్కొన్నారు.
జీవితంలో నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
By admin1 Min Read