విశాఖపట్నంలో అనకాపల్లి-ఆనందపురం NH-16 కారిడార్‌ను షీలానగర్ జంక్షన్‌కు కలుపుతూ 12.66 కి.మీ ల 6-లేన్ యాక్సెస్-నియంత్రిత హైవే నిర్మాణం కోసం రూ.963.93 కోట్లు మంజూరు చేశారు.
ఈ విషయం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు .ఈ కారిడార్ ట్రాఫిక్ అంతరాయాలను తగ్గిస్తుంది. మరియు షీలానగర్-ఆనందపురం ట్రాఫిక్‌ను సమర్థవంతంగా వేరు చేయడం ద్వారా కార్గో తరలింపు సులభతరం అవుతుంది. విశాఖపట్నం పోర్టుకు కనెక్టివిటీని గణనీయంగా పెంచుతుంది మరియు లాజిస్టికల్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలకు ఏపీ బీజేపీ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి గడ్కరీకి ధన్యవాదాలు తెలిపింది.
విశాఖలో 12.66 కి.మీ ల 6-లేన్ యాక్సెస్-కంట్రోల్ హైవే నిర్మాణం కోసం రూ.963.93 కోట్లు మంజూరు
By admin1 Min Read
Previous Articleబిహార్‌లో విషాదం…ప్రాణాలు తీసిన పబ్జీ…!
Next Article సత్యరాజ్ ‘త్రిబాణధారి బార్బరిక్’ టీజర్ రిలీజ్