ప్రధాని మోడీ నేతృత్వంలోని ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తాను స్వయంగా నిర్వహిస్తున్న పంచాయితీ రాజ్ శాఖ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు కొన్నింటిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతా వేదికగా పంచుకున్నారు. వైసీపీ పాలనలో ఐదేళ్ల కాలంలో 1800 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయగా… కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలోనే 3750 కిలో మీటర్ల సీసీ రోడ్లు వేసినట్లు వివరించారు. అదే విధంగా మినీ గోకులాలు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 268 కాగా కూటమి ప్రభుత్వంలో 22500 అని పేర్కొన్నారు. పీవీటీజీ హ్యాబిటేషన్స్ గత వైసీపీ ప్రభుత్వలో 91 కోట్ల రూపాయలుగా ఉండగా ఎన్డీయే కూటమి పాలనలో రూ750 కోట్లు అని తెలిపారు.
In NDA Govt under the leadership of Hon. PM Sri @narendramodi Ji and Hon. CM Sri @ncbn garu the following are few milestones achieved in AP Panchayat Raj dept.
*CC Roads*
YSRCP ( 5 yrs) : 1800 kms
NDA ( 6 months ) : 3750 kms*Mini Gokulam*
YSRCP ( 5 yrs ) :…
— Pawan Kalyan (@PawanKalyan) January 12, 2025