విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,440 కోట్లు ప్యాకేజీ ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈమేరకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన కూడా చేశారు. కాగా, దీనిపై తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన తెలుగులో తన పోస్ట్ చేశారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. నిన్నటి మంత్రివర్గ సమావేశంలో, ఈ కర్మాగారానికి రూ. 10,000 కోట్లకు పైగా పెట్టుబడిని మద్దతుగా అందించాలని నిర్ణయించాము. ఆత్మనిర్భర భారత్ సాధించడంలో ఉక్కు రంగానికున్న ప్రాముఖ్యతను అర్ధం చేసుకొని ఈ చర్య చేపట్టామని ప్రధాని పేర్కొన్నారు.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. నిన్నటి మంత్రివర్గ సమావేశంలో, ఈ కర్మాగారానికి రూ. 10,000 కోట్లకు పైగా పెట్టుబడిని మద్దతుగా అందించాలని నిర్ణయించాము. ఆత్మనిర్భర భారత్ సాధించడంలో ఉక్కు రంగానికున్న ప్రాముఖ్యతను అర్ధం చేసుకొని ఈ చర్య…
— Narendra Modi (@narendramodi) January 17, 2025