కృష్ణా జిల్లా, కొండపావులూరు గ్రామంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదరన్ క్యాంపస్ NIDM ప్రారంభోత్సవం, NDRF 20వ రైజింగ్ డే వేడుకల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్న సమయంలో వికసిత్ భారత్ లో విపత్తు నిర్వహణ అనేది చాలా కీలకమని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను అంచనా వేయడం, దానికి తగినట్లుగా సన్నద్ధం కావడం అనేది నిరంతర ప్రక్రియని మారుతున్న ప్రపంచ వాతావరణ పరిస్థితులతో పాటు, స్థానికంగా మారుతున్న వాతావరణ అంశాలను బేరీజు వేసుకొని ముందుకు సాగాలని సూచించారు. విపత్తులు కేవలం ప్రకృతి సంబంధమైనవి మాత్రమే కాదని మానవులు చేసినవి కూడా ఉంటాయన్నారు. 2024 ఎన్నికల్లో గత ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రంలో ఏ స్థాయి విపత్తు ఉండేదో ఊహించాలి. అలాంటి విపత్తు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో, హోంమంత్రి అమిత్ షా సూచనలతో, చంద్రబాబు నాయకత్వంలో కలసి పని చేశామని చెప్పారు. ప్రజలను గత ప్రభుత్వ విపత్తు నుండి కాపాడగలిగామని పేర్కొన్నారు. అదే ఈ రోజున ఇక్కడ ఈ ప్రాంగణం ప్రారంభించడానికి దోహదపడిందని తెలిపారు.గత ఆరు నెలలుగా రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరిన నాటి నుంచి కేంద్రం అందిస్తున్న సహకారం అమోఘమని కొనియాడారు . విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్రత్యేకంగా నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది రాష్ట్రానికి ఓ అభివృద్ధి సూచిక అని భావిస్తున్నట్లు తెలిపారు.
వికసిత్ భారత్ లో విపత్తుల నిర్వహణ కీలకం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
By admin1 Min Read
Previous Articleనా కొడుకుని ఉరి తీసినా తప్పులేదు: సంజయ్ రాయ్ తల్లి
Next Article మహా కుంభమేళాలో అగ్ని ప్రమాదం.. భక్తులు కంగారు