రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శకటానికి 30 ఏళ్ల తర్వాత జ్యూరీ అవార్డు దక్కింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏటికొప్పాక బొమ్మలతో రూపొందించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీ వేంకటేశ్వరస్వామి, వినాయకుడు, ఇరువైపులా బొబ్బిలి వీణలు, తెలుగువారి కట్టుబొట్టు ప్రతిబింబించేలా అమర్చిన ఏటికొప్పాక బొమ్మల కొలువుతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ లో ఏటికొప్పాక బొమ్మల కొలువు ఇతివృత్తంతో ప్రదర్శించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటానికి మూడో స్థానం రావడం సంతోషకరమని… రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. కేంద్ర రక్షణ శాఖ ప్రకటించిన ఉత్తమ శకటాల జాబితాలో తొలి స్థానంలో ఉత్తరప్రదేశ్ శకటం, రెండవ స్థానంలో త్రిపుర శకటం ఉండగా మూడో స్థానం ఏపీకి దక్కింది. ఈ సందర్భంగా శకటం రూపకర్తలకు, రాష్ట్ర అధికారులకు… ప్రత్యేకించి ఏటికొప్పాక బొమ్మలు తయారు చేసే కళాకారులకు అభినందనలు తెలుపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు