జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను మార్చి 14వ తేదీన నిర్వహించనున్నారు. పిఠాపురంలో ఈ వేడుకలను చేపట్టాలని పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రయిక్ రేట్ తో జనసేన విజయ బావుటా ఎగుర వేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల అనంతరం నిర్వహిస్తున్న తొలి ఆవిర్భావ సభ ఇది కావడంతో భారీగా జనసేన శ్రేణులు పాల్గొని ఈ వేడుకలను మరింత ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Previous Articleఆషికి-3 తో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల…!
Next Article ఎంపీ అబద్ధాలు చెప్పడంతో జరిమానా విధించిన కోర్ట్!