కనీసం సెలవు కూడా పెట్టకుండా సంవత్సరానికి పైగా విధులకు హాజరు కానీ 55 మంది వైద్యులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేటు వేసింది.ఈ మేరకు విధులకు వైద్యులు గైర్హాజరవుతున్నారని…వైద్యులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారంటూ కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్తను ఆశ్రయించారు.ఈ విషయాన్ని లోకాయుక్త చాలా సీరియస్ గా తీసుకుంది.
అయితే దీనిపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరింది.కాగా విధులకు హాజరుకాని వారిని గుర్తించి, వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.తాజాగా లోకాయుక్త ఆదేశాల మేరకు విధులకు హాజరు కాని 55 మందిని ప్రభుత్వం గుర్తించి టెర్మినేట్ చేసింది.ఇక టెర్మినేట్ చేసిన వైద్యుల్లో అసోసియేట్ ప్రొఫెసర్లు,అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఉన్నారని తెలుస్తుంది.