ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టును పంచుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి ఎన్నో ఏళ్ల కిందట హైదరాబాద్ కు వలసవెళ్లి అక్కడే వెదురు బుట్టలు, విసనకర్రలు, కొబ్బరి ఆకులతో పలు ఉత్పత్తులు తయారు చేస్తూ జీవిస్తున్న ఒక వ్యక్తి గురించి హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ అనే సోషల్ మీడియా హ్యాండిల్ పోస్టు చేసింది. దీనిని షేర్ చేస్తూఏపీ సీఎం చంద్రబాబు స్ఫూర్తిదాయకమైన జీవిత పాఠమని అన్నారు. అతని కథ ఆంధ్ర ప్రదేశ్ కష్టపడి పనిచేసే తత్వం యొక్క స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. అతను అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లిపోవాల్సి రావడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఆ వ్యక్తి పనితనం, ఆశావహ దృక్పథం బాగా నచ్చాయని తన కలలను, కళను కలగలిపి వస్తువులుగా మలిచి జీవనం సాగిస్తుండడాన్ని ప్రగాఢంగా అభిమానిస్తున్నానని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నామని తద్వారా అతనిలాంటి ప్రతిభావంతులు ఇక్కడే అభివృద్ధి చెందుతారని తెలిపారు.
Inspiring life lesson. His story reflects the hard-working and entrepreneurial spirit of Andhra Pradesh. While I’m saddened he had to leave in search of opportunities, I deeply admire his craft, weaving hope, dreams, and art together into admirable products. We are working to… https://t.co/nw7FkkkRSj
— N Chandrababu Naidu (@ncbn) February 21, 2025