సినీ నటుడు,మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గుంటూరు కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది.ఈ మేరకు ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.అయితే పోసానిపై ఇప్పటి వరకు నమోదైన అన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. కాగా ఆయన కర్నూలు జైలు నుండి విడుదల అవుతారని అందరూ భావిస్తున్న సమయంలో… గుంటూరు సీఐడీ పోలీసులు ఆయనపై పీటీ వారెంట్ దాఖలు చేశారు.పీటీ వారెంట్ ను కొట్టివేయాలని ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయగా…ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.కర్నూలు నుండి గుంటూరుకు పోసానిని తీసుకెళ్లిన పోలీసులు…ఆయనను సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టారు.కోర్టులో వాదనల సమయంలో జడ్జి ఎదుల పోసాని భోరున విలపించారని సమాచారం.నా ఆరోగ్యం బాగోలేదని…బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోయారని తెలుస్తుంది.ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి…పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

