ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో సీజ్ చేసిన 53 కిలోల బంగారు నగలను తమకు అప్పగించాలని గాలి జనార్దన రెడ్డి చేసిన విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది.అలాగే, నగదు, 5 కోట్ల రూపాయల విలువైన బాండ్లను కూడా విడుదల చేయాలని ఆయన కుమార్తె బ్రాహ్మణి, కుమారుడు కిరీటిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.నగలు తుప్పు పట్టి విలువ తగ్గుతుందని గాలి వాదనను కోర్టు సమర్థించలేదు.ఓఎంసీ కేసు విచారణ పూర్తయిన తర్వాతే ఆస్తులపై హక్కుల నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.అక్రమ మైనింగ్ ద్వారా 884.13 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని సీబీఐ కేసు నమోదు చేసిందని కోర్టు పేర్కొంది.ఈ దశలో సీజ్ చేసిన ఆస్తులను అప్పగించలేమని తేల్చి చెప్పిన హైకోర్టు, విచారణ అనంతరం తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.ఈ తీర్పుతో గాలి జనార్దన్ రెడ్డి కుటుంబం తీవ్ర నిరాశకు గురైంది.
Previous Articleదక్షిణాది రాష్ట్రాల్లో తన ప్రభావం లేనందుకే ఈ కక్ష్య సాధింపు చర్య: డీలిమిటేషన్ పై ఏపీసీసీ చీఫ్ షర్మిల
Next Article జనసేనకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు..!

