ఏపీ సీఎం చంద్రబాబు నేడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు ఆయన మనుమడు నారా దేవాంశ్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల చేరుకుని స్వామి వారి దర్శనం చేసుకున్నారు. తిరుమల చేరుకున్న వారికి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు, అర్చకులు స్వాగతం పలికారు. దర్శనం తర్వాత వేదపండితులు రంగనాయకులు మండపంలో ఆశీర్వచనాలు అందించి స్వామి వారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో దేవాంశ్ పేరుతో అన్నదానం చేశారు. చంద్రబాబు, కుటుంబ సభ్యులు ప్రసాదాలు వడ్డించారు.

నేడు నారా దేవాంశ్ పుట్టిన రోజు…శ్రీవారి సేవలో ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు
By admin1 Min Read

