ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా దీపం-2 పథకం అమలవుతోంది. ప్రతి పేద ఆడబిడ్డకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయనున్నట్టు ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.ఈ పథకంలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి ఈ నెలాఖరు వరకు గడువు ఉందని ఆయన సూచించారు.ఇప్పటి వరకు 98 లక్షల మంది దీని లబ్ధి పొందారు.
ఉచిత సిలిండర్ పొందే విధానం:-
వినియోగదారులు సాధారణంగా బుక్ చేసుకోవాలి (ముందుగా సొమ్ము చెల్లించాలి).
పట్టణాల్లో 24 గంటల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లో గ్యాస్ డెలివరీ అవుతుంది.
48 గంటల్లోపు లబ్ధిదారుల ఖాతాలో తిరిగి డబ్బు జమ అవుతుంది.
ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందించనున్నారు.
ఏప్రిల్-జూలై, ఆగష్టు-నవంబర్, డిసెంబర్-మార్చి మధ్య ఒక్కో సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉంది.
అర్హతలు:-
ఎల్.పి.జి కనెక్షన్ ఉండాలి
రేషన్ కార్డ్ ఉండాలి
ఆధార్ కార్డు తప్పనిసరి
రైస్ కార్డుతో ఆధార్ అనుసంధానం అయ్యి ఉండాలి.
ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1967 కు ఫిర్యాదు చేయవచ్చు. ఈ పథకం ద్వారా లక్షలాది పేద కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయని ప్రభుత్వం పేర్కొంది.